ఆదిపురుష్ పై అంచనాలు పెంచే విధంగా కృతి సనన్.!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుక గా రిలీజ్ చేద్దామని అనుకుంటే గ్రాఫిక్స్ వర్క్ కోసం రిలీజ్ వచ్చే సంవత్సరం జూన్ కు వాయిదా వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాల తో వుంటే  ప్రమోషన్స్ లో భాగంగా  రిలీజ్ చేసిన టీజర్  లో గ్రాఫిక్స్ నాసిరకం అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అలాగే చాలా మంది   హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని విమర్శించారు.

ఈ సినిమా  గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో మళ్లీ VFX వారితో మాట్లాడి, మంచిగా వచ్చేలా చేయటం కోసం డైరెక్టర్ ఓం రౌత్ నిర్మాత తో మాట్లాడి మరో వంద కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. తేజ సజ్జ హునుమన్ సినిమా వచ్చాక  ఆదిపురుష్ టీజర్ పై మరోసారి మరోసారి ట్రోల్ జరిగింది. దీనితో జనవరి నుంచి జూన్ కి వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్టుగా పలు రూమర్స్ అయితే గట్టిగా వినిపించాయి. కాని అదే నెలలో ఖచ్చితంగా రిలీజ్ ఫిక్స్ అని ప్రకటన తో ఫ్యాన్స్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.

తాజగా ఆధిపురుష్ లో సీత గా చేసిన కృతి సనన్ ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. సీత పాత్ర నాకు ఎంతగానో నచ్చింది అని పేర్కొంది.రామానంద్ సాగర్ రామాయణం గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. కానీ నేను ఆ రామాయణం చూడలేదు. నాలాంటి వారందరికీ ఆదిపురుష్ చిత్రం బాగా నచ్చుతుంది అని పేర్కొంది. ఇప్పటి తరం పిల్లలకు ఆదిపురుష్ చిత్రం రామాయణం గురించి అవగాహన పెంచుతుంది అని తెలిపింది. ఇది కేవలం చిత్రం మాత్రమే కాదు.. ఒక విజువల్ వండర్ లాగా ఉంటుంది అంటూ అంచనాలు పెంచే విధంగా కామెంట్స్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news