గూగుల్ స్టోరేజీ ఫుల్ అయిపోయిందా..? ఇలా చేస్తే ఫ్రీగా స్టోరేజీ స్పేస్ ని పెంచేయచ్చు..!

-

Google storage: గూగుల్ అకౌంట్ స్టోరేజీ ఫుల్ అయ్యిందా..? చాలా మందికి ఇదే సమస్య. ఈ సమస్య నుండి ఇలా సులభంగా బయట పడవచ్చు. ప్రతి ఒక్కరూ గూగుల్ డ్రైవ్ యాప్‌ను ఇప్పుడు వాడుతున్నారు. ప్రతి గూగుల్ అకౌంట్ కి కూడా కేవలం 15GB వరకు మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. అది ఫుల్ అయిందంటే ఇబ్బందే.

 

ఒక్క రూపాయి కూడా కట్టకుండా స్టోరేజీని ఎలా పెంచుకోవచ్చు అనేది ఇప్పుడు చూసేద్దాం. Takeout వెబ్ సైట్ ద్వారా 15జీబీ డేటాను ఒకేసారి మనం తీసేసి ఆఫ్ లైన్ లో స్టార్ చెయ్యచ్చు.

ముందు మీరు గూగుల్ సెర్చ్ లో Google takeout అని నొక్కండి.
ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ ని డిసెలెక్ట్ చేయండి.
ఇప్పుడు స్క్రోల్ చేయండి. Drive & Google Photos మీద నొక్కండి.
డ్రైవ్ ఫైల్స్, ఫోటోలు, వీడియోలు కి ఎక్కువ స్పేస్ పడుతుంది.
ఇప్పుడేమో మీరు Nextstepపైన క్లిక్ చేయండి.
ఏమైనా మార్పులు కావాలంటే చేసుకుని. Create Exportని క్లిక్ చేయండి.
ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకో మెయిల్ వస్తుంది. అక్కడ మీరు డౌన్ లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అన్నీ సేవ్ అవుతాయి. డ్రైవ్ లో అన్నీ డిలీట్ చేస్తే స్పేస్ అంతా ఫ్రీనే.

Read more RELATED
Recommended to you

Latest news