చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ సీక్రెట్ వీడియోలు.. అందుకే బాబుకు పవన్ తోక ఊపుతున్నారా?

-

ముందుగా ఏపీలో ద్విముఖ పోటీ అనుకున్నారు. నెమ్మదిగా పవన్ కల్యాణ్ కూడా పుంజుకున్నారు. ప్రస్తుతం త్రిముఖ పోటీ అన్నట్టుగా ఉంది ఏపీలో. అయినప్పటికీ.. పవన్ కల్యాణ్.. చంద్రబాబు తొత్తే అంటూ వార్తలు వస్తున్నాయి.

దేశంలోని ఏ రాష్ట్రంలో మారనంతగా… ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. క్షణ క్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. దేశంలో ఎవరు ప్రధాని అవుతారు.. అనేది ఇప్పుడు ఉత్కంఠగా లేదు. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేదానిపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. అలా ఉన్నాయి ఏపీలో రాజకీయాలు.

ముందుగా ఏపీలో ద్విముఖ పోటీ అనుకున్నారు. నెమ్మదిగా పవన్ కల్యాణ్ కూడా పుంజుకున్నారు. ప్రస్తుతం త్రిముఖ పోటీ అన్నట్టుగా ఉంది ఏపీలో. అయినప్పటికీ.. పవన్ కల్యాణ్.. చంద్రబాబు తొత్తే అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా పవన్ వ్యాఖ్యలు కూడా ఉండటంతో అసలు ఏపీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు.తన ప్రచారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై ఆవేశంతో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్.. ఏపీ సీఎం చంద్రబాబును మాత్రం పల్లెత్తి మాట అనడం లేదు. ఒక్క మాట కూడా పవన్.. చంద్రబాబును అనకపోవడంతో.. వీళ్ల మధ్య ఏదో ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ప్రజలు కూడా వీళ్లిద్దరూ ఒకటే అనే భావనలో ఉన్నారు.దానికి బలం చేకూరుస్తూ… శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. పవన్ ను విమర్శిస్తూ ఆమె షేర్ చేసిన పోస్ట్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.


ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసింది అంటారా… ‘తెలుగు దేశం దగ్గర వీడి రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసే ఆడియో వీడియోలు ఉన్నాయ్. అందుకే తెలుగుదేశం ఎప్పుడు పవన్ విషయంలో కేర్ లెస్ గా వదిలేసింది. ఎప్పుడు దార్లోకి తెచ్చుకోవాలో వాళ్లకి తెలుసు అందుకే చంద్రబాబు గారు కాదు ఆయన చాణక్యుడు… బాబు గారు గారు లోకేశ్ గారు కూల్ గా ఉన్నారు.. అందుకే పవన్ టెన్షన్ గా మాట్లడతాడు. ఇదీ నిక్కచ్చయిన నిజం. పవన్ జాతకంలో గ్రహాలుని కంట్రోల్ లో పెట్టేవారు చంద్రబాబు గారు. అందుకే ఆయన ఏమంటే దానికి ఈయన తోక ఊపాలి హహహ..’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

ఃఅది అసలు మ్యాటరా? అందుకే పవన్.. బాబు ఏది చెబితే అది చేస్తున్నారా? చంద్రబాబు, పవన్ ఒకటేనా? చంద్రబాబు పవన్ ను.. పవన్ చంద్రబాబును అందుకే విమర్శించడం లేదా? వచ్చే ఎన్నికల్లో పవన్ ఎన్ని సీట్లు గెలిచినా అవి చంద్రబాబుకు దక్కాల్సిందేనా? అసలు శ్రీరెడ్డి చెప్పింది నిజమేనా? ఎన్నికల వేళ కావాలని బురద జల్లుతోందా? ఇదిగో ఇలాంటి వంద డౌట్లు సామాన్య జనాలకు వస్తున్నాయి. అసలు శ్రీరెడ్డి.. పవన్ పై ఎన్నికల వేళ విరుచుకుపడటం ఏంటో.. దీని వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఇవన్నీ తెలియాలంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news