Sushmita Sen: లలిత్ మోడీతో సుస్మిత సేన్ బ్రేకప్..!

బాలీవుడ్ హీరోయిన్, విశ్వసుందరి సుస్మిత సేన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె మూడుసార్లు వివాహం చేసుకోవాలనుకున్నప్పటికీ.. వివాహం వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉండేవి దీంతో ఆమె వివాహం పైన నమ్మకం లేదనే వ్యాఖ్యలు గత కొద్ది రోజుల క్రిందట చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల కిందట సుస్మిత సేన్ తో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ఐపిఎల్ ఫౌండర్ లలిత్ మోది తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే.. జూన్ 14వ తేదీన డేటింగ్ ప్రకటన చేసిన లలిత్ మోది ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సుస్మితతో లలిత్ బ్రేకప్ అయినట్లు రూమర్లు వస్తున్నాయి. ఇద్దరు ఇంటిమేట్ గా ఉన్న ఫోటోలను గతంలో షేర్ చేసిన లలిత్ మోది ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫోటోలను డిలీట్ చేశాడు. త్వరలో పెళ్లి చేసుకోబోనున్నట్లు చెప్పిన లలిత్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తలేదు. ఇన్స్టా లో సుస్మిత సేన్ ఫోటోను తీసేసాడు .అంతే కాదు ఇంస్టాల్ డిపి, బయోను లలిత్ మార్చేశాడు. దాంట్లో సుస్మిత ఫోటో కానీ, సమాచారం కానీ లేదు. దీంతో బహుశా ఇద్దరు బ్రేకప్ బ్రేకప్ అయ్యి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.