పూరికి “లైగర్” సెగ తగిలింది. లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ముందు ఎగ్జిబిటర్స్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మేము లైగర్ సినిమా కొనుగోలు చేసి నష్టపోయాం. మాకు న్యాయం చేయాలని నిరవధిక దీక్ష చేస్తున్నామని వివరించారు.
లైగర్ సినిమాతో చాలా కష్టాల్లో ఉన్నాం… లీజర్లు అందరూ ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. పూరి డబ్బులన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలలు ఆగాము. ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించారు. పూరి, విజయ్ మాకు న్యాయం చేయాలి… మీ మీద ఎలాంటి కోపం లేదు.. మేము చిన్న వాళ్ళము. మమ్మల్ని ఇప్పుడు రోడ్డు మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఫిల్మ్ ఛాంబర్ లో లెటర్ ఇచ్చాము. ఒక్కో ఎగ్జిబిటర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూరి జగన్నాథ్ మాకు తొమ్మిది కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.