‘మా’ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే చర్యలు తప్పవు: మంచు విష్ణు

-

మంచు విష్ణు.. మా అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించారు. ‘మా’లో శాశ్వత సభ్యత్వం, ఓటు హక్కుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా ‘మా’ విషయంలో మీడియా ముందుకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా, విమర్శలు చేసినా, సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినా క్రమశిక్షణ చర్యల కింది వారి సభ్యత్వం రద్దు చేయబడుతుందని అన్నారు. అయితే మళ్లీ ఈ విషయాలపై వివరణ ఇచ్చారు.

ఎవరైనా మా గురించి ఆఫీస్​ బేరర్స్​ గురించి వ్యక్తిగతంగా తప్పుగా మాట్లాడచ్చు గానీ.. ‘మా’ కుటుంబం గురించి, కళామ్మతల్లి గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వెంటనే సభ్యత్వం నుంచి తీసేస్తాం. ఐదేళ్ల లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌ ఉంటేనే ఓటు హక్కు వస్తుంది. ఇప్పుడు 900 మంది సభ్యులు ఉన్నారు. నా పదవీ కాలం పూర్తయ్యేలోపు ఇంకా 300 మంది చేరుతారు. అందరికీ సౌకర్యాలు కల్పిస్తాం. కానీ, ఓటు మాత్రం ఐదేళ్ల తర్వాతే వస్తుంది. మీ ఇంట్లో గొడవ జరిగితే పెద్దలకు చెప్తారా? లేక రోడ్డు మీదకు వచ్చి మీడియా ముందు గొడవ చేస్తారా? ఇంట్లో సమస్య ఏదైనా ఉండి.. అది తీరనప్పుడు మీ పెద్దల వద్దకు వెళ్తారు. మీడియా ముందు కావాలని పబ్లిసిటీ కోసం గోల చేయడం మంచిది కాదు కదా.. అందుకే ఇండస్ట్రీలో పెద్దలను డీఆర్సీ కమిటీలో పెట్టాం.

నాన్న, బాలకృష్ణ, గిరిబాబు, శివకృష్ణ, జయప్రద, అన్నపూర్ణ.. మా నిర్ణయం కరెక్ట్‌ కాదని అన్నప్పుడు మేము వాళ్లు చెప్పిందే వింటాం. నేను 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు. మేమంతా ఒక కుటుంబం. చేతికి ఉన్న ఐదువేళ్లు ఎలా అయితే ఒకేలా ఉండవు, ఒక కుటుంబంలో అందరూ సక్రమంగా ఉండరు. తప్పుదారి ఎంచుకున్న వారికి హెచ్చరికగా రూల్స్ మార్చాం” అని మంచు విష్ణు పేర్కొన్నారు.

అంతకుముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాశ్వత సభ్యతం, ఓటు హక్కు గురించి ఈ విధంగా మాట్లాడారు మంచు విష్ణు. ” ‘మా’లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. 5 నిమిషాలైనా సినిమాలో డైలాగు చెప్పిన వాళ్లకే అసోసియేట్‌ సభ్యత్వం. అసోసియేట్‌ సభ్యులకు ‘మా’లో ఓటు హక్కు లేదు” అని విష్ణు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news