మహేష్ బాబు ని కన్‌ఫ్యూజ్ చేస్తున్న కియారా అద్వాని కీర్తి సురేష్ …!

-

సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్ లో అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడి మంచి కమర్షియల్ హిట్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మేజర్ గా అద్భుతమనిపించారు. అంతేకాదు మాస్ లుక్ లోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి తో సూపర్ స్టార్ సినిమా సెట్స్ మీదకి వెళుతుందనుకున్నారు. అంతేకాదు దసరా లేదా దీపావళి కానుకగా రిలీజ్ కూడా అవుతుందనుకున్నారు. కాని వంశీ పైడిపల్లి చెప్పిన కథ సూపర్ స్టార్ ని మెప్పించలేక మొత్తానికే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

 

దాంతో సరిలేరుని తెరకెక్కించిన అనిల్ రావిపూడి తాజా చిత్రం ఎఫ్ 3 లో మహేష్ బాబు నటిస్తున్నారని ఈ సినిమా మే నుంచి మొదలవబోతుందని సమాచారం.
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందనుందన్న సంగతి తెలిసందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 27వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాకి గీతగోవిందం ఫేమ్ పరశురామ్ ఓకే అయినట్టు తాజా సమాచారం. మహేష్ బాబు పరశురామ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ని అధికారకంగా త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మించబోతున్నారు.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్టు తాజా సమాచారం. మహానటి, అజ్ఞాతవాసి సినిమాల తర్వాత కీర్తి సురేష్ మళ్ళీ తెలుగు సినిమా లో కనిపించలేదు. నాగార్జున నటించిన మన్మధుడు లో చిన్న గెస్ట్ రోల్ పోషించినప్పటికి అది థియోటర్ నుండి బయటికి రాగానే మర్చిపోయో క్యారెక్టర్ కాబట్టి అది లెక్కలోకి రానట్టే. ఇక తాజాగా మహేష్ తో రూపొందబోయో సినిమాకి కీర్తి సురేష్ అయితే బాగుంటుందని పరుశురామ్ భావిస్తున్నాడట.

కాని నిర్మాతలు కియారా అద్వాని ని కూడా అనుకుంటున్నారట. ఇప్పటికే కియారా మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో మరో సారి ఈ జంట ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారాన్న భావనలో మైత్రీ వాళ్ళు ఉన్నారట. అయితే ఫైనల్ డెసిషన్ మహేష్ బాబు చేతిలో ఉండటం తో ఆయన కూడా ఈ ఇద్దరిలో ఎవరిని ఒకే చేద్దామా అన్న కన్‌ఫ్యూజన్ లో ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news