కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ పాటించాలి అంటూ ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాలు ఎంత ఖచ్చితంగా ఈ లాక్ డౌన్ ను పాటించాలని చూస్తున్నప్పటికీ జనాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ కేంద్రాల లో 14 రోజుల పాటు నియమాలను పాటించాలి అంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది మాత్రం ఈ క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోతూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు. తమిళనాడు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఒక యువకుడిని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తే ఆ యువకుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తుంది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు చివరికి అతగాడిని పట్టుకొని ఎందుకు పారిపోయావు అని ప్రశ్నించగా అప్పుడు చెప్పాడు అసలు విషయం. అది విన్న పోలీసులు షాకయ్యారు. మదురైకి చెందిన యువకుడు(24) ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడు. అతనిని అధికారులు మదురైలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే సడెన్‌గా ఆ యువకుడు క్వారంటైన్ కేంద్రం తప్పించుకుని పారిపోయాడు. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది అతడి కోసం పరుగులు పెట్టి చివరికి అతడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి అతగాడిని ప్రశ్నించగా, ప్రియురాలి కోసం అతడు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయాను అంటూ చెప్పడం తో పోలీసులు షాక్ తిన్నారు. ఇంతకీ ఆ యువకుడు ని గుర్తించింది కూడా శివగంగ జిల్లా లోని అతగాడి ప్రియురాలి ఇంటిలోనే. దీనితో అతడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
క్వారంటైన్ నిబంధనలను ఉల్లంగించినందుకు అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతగాడిని అన్ని వివరాలు అడుగగా ఆ యువకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తమ ప్రేమకు ప్రియురాలి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని.. అందుకే ప్రియురాలిని కలిసేందుకు వెళ్లానని చెప్పాడు. దీంతో ప్రియురాలిని సైతం క్వారంటైన్ కేంద్రానికి తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి కరోనా మహమ్మారి తో ప్రపంచ వ్యాప్తంగా 24 వేల మంది మృతువాత పడగా,5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.