గత ఏడు నెలలుగా కరోనా స్వైర విహారం చేస్తుండటంతో సెలబ్రిటీలు ఇంటి పట్టునే వుంటున్నారు. బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో వారికి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుప్తున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ప్రధాన వినోద సాధనంగా నిలిచింది. ఇందులో హాలీవుడ్ మూవీస్‌తో పాటు వెబ్ సిరీస్‌లని చూస్తూ సెలబ్రిటీలు ఎంజాయ్ చేస్తున్నారు. వాటి గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.
స్టార్ హీరో మహేష్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న `ది సోషల్ డైలామాని`ని చూశారట. తనకు హారర్ జోనర్ అంటే చాలా ఇష్టమని చెప్పిన మహేష్ ఇప్పటి వరకు చాలా హారర్ చిత్రాల్ని చూశానని కానీ వాటన్నింటిలో నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన `ది సోషల్ డైలామా` అత్యంత భాయనకంగా వుందని, ఇప్పటికీ తన వెన్నులో వణుకు పుట్టిస్తోందని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న `ది సోషల్ డైలామా` ని చాలా మంది సెలబ్రిటీలు వీక్షించారు. దీనిపై ఎవరికి నచ్చిన వ్యూని వారు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ మూవీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.