ఆచార్య కోసం రంగంలోకి మహేష్.. చిరు ఎమోషన్ ట్వీట్

-

తెలుగు సినిమా అభిమానులు అందరూ ఈగర్ గా ‘ఆచార్య’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ లను వెండితెరపైన అలా చూసి ఆనంద పడాలని అనుకుంటున్నారు. అయితే, ఈ ఆత్రుత, ఎదురుచూపులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. అగ్రరాజ్యం అమెరికాలోని తెలుగు సినీ అభిమానులు కూడా ఈగర్ గా ‘ఆచార్య’ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన గళాన్ని అందించనున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు దానిని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మా ఆచార్య లో పద ఘట్టాన్ని మహేష్ తన గొంతుతో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందని ఈ చిత్రానికి మహేష్ తన వంతుగా ప్రత్యేక.. పాత్ర పోషించిన అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అలాగే అభిమానులు మరియు ఆడియన్స్ కూడా నేను రామ్ చరణ్ అయితే అదే విధంగా వారు కూడా అవుతారని చిరు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news