ఇక్కడ అరిస్తే అమరావతిలో వినపడాలే..!

-

మహి వి రాఘవ్ డైరక్షన్ లో మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర. వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా ముఖ్యంగా ఆయన చేసిన పాదయాత్ర నేపథ్యంతో కథ సాగుతుంది. అందుకే సినిమాకు యాత్ర అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 8న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం సాయత్రం ఎన్.కన్వెన్షన్ లో జరిగింది.

చిత్రయూనిట్ తో పాటుగా వైఎస్ అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపగా.. సినిమా యూనిట్ అంతా వైఎస్ అభిమానులను ఉత్సాహపరచేలా మాట్లాడారు. డైరక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు తను చాలా కష్టపడ్డానని చెబుతున్నారు.. కాని వారు చెబుతున్నట్టుగా తానేమి కష్టపడలేదని.. తన టీం తనని సుఖంగా పనిచేసుకునేలా చేశారని చెప్పాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని. అయితే మహానుభావుల కథ విన్నప్పుడు తనకు వైఎస్ కథని సినిమాగా తీయాలనిపించిందని అన్నారు.

ఇక వైఎస్ అభిమానులను ఉద్దేశిస్తూ జగన్ అన్నని రెండు సార్లు కలిశా కలిసిన రెడుసార్లు మీ నాయకుడు కథ మీకు ఇష్టం వచ్చినట్టుగా తీయండని అన్నారని మహి వి రాఘవ్ చెప్పాడు. ఇక వైఎస్ అభిమానులను ఇక్కడ అరిస్తే ఇడుపులపాయకు.. అమరావతికి వినిపించాలని ఉత్తేజబరితంగా మాట్లాడాడు.

సినిమాలో వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి మాట్లాడుతూ.. 22 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా చేశానని.. వైఎస్ బయోపిక్ అనగానే ఏదో ఇన్వెస్టిగేషన్ సినిమా అనుకున్నా బయోపిక్ కథ శ్యామ్ దత్ ద్వారా తన దగ్గరకు వచ్చిందని. దర్శక నిర్మాతలు పూర్తి కథ చెప్పారని.. సినిమాకు మేం చేయాల్సింది చేశాం.. ఇక చేయాల్సింది మీరేనని.. వైఎస్ మీద చూపించిన అభిమానంలో 1 పర్సెంట్ తనని అభిమానించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news