ఆ ఫ్రెంచ్ మూవీ క‌థ‌ను మ‌న్మ‌థుడు 2 టీం కాపీ కొట్టింద‌ట‌..?

-

మ‌న్మ‌థుడు 2 క‌థ‌ను నిజంగానే ఆ ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ చేశారా, లేదా.. అన్న వివ‌రాలు తెలియ‌లేదు. కానీ ఒక వేళ అదే నిజ‌మైతే ఆ చిత్ర యూనిట్ కూడా మ‌న్మ‌థుడు 2 బృందంపై కాపీ రైట్ వేస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

అంతే.. నాలుగైదు ఇంగ్లిష్ సినిమాలు చూడ‌డం.. వాటిలోని క‌థ‌ల‌ను క‌లిపి ఓ కొత్త క‌థ రాసుకోవ‌డం.. లేదా ఇంగ్లిష్ కాకుండా వేరే ఏదైనా భాష‌కు చెందిన మూవీ క‌థ‌ను తీసుకుని దాన్ని తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్టు త‌యారు చేసుకుని సినిమా క‌థ రాసి తెర‌కెక్కించ‌డం.. ఇదే క‌దా ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో జ‌రుగుతోంది. అంతెందుకు.. త‌మిళ ద‌ర్శ‌కులు కూడా దాదాపుగా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇక ప్ర‌స్తుతం తెలుగులో నాగార్జున హీరోగా తెర‌కెక్కుతున్న ‘మ‌న్మ‌థుడు 2’ కూడా ఓ సినిమాకు కాపీ అని మ‌న‌కు తెలుస్తోంది. ఇంత‌కీ.. ఏంటా సినిమా..? అంటే..

2006లో ‘ప్రేతే మెయి తా మై’ అనే ఫ్రెంచ్ మూవీ రిలీజైంది. అందులో హీరోకు 45 ఏళ్లు వ‌స్తాయి. అయినా అత‌ను వివాహం చేసుకోడు. దీంతో ఇంట్లో వాళ్లు ఒక‌టే పోరు పెడుతుంటారు. అది నచ్చ‌ని హీరో ఒక యువతిని ఇంట్లో త‌న భార్య అని ప‌రిచ‌యం చేస్తాడు. కానీ ఆమె అత‌ని అస‌లు భార్య కాదు. అద్దెకు తెచ్చుకున్న భార్య‌. అయితే రాను రాను ఆ యువ‌తితోనే హీరో ప్రేమ‌లో ప‌డ‌తాడు. స్థూలంగా ఇదీ స్టోరీ.. అయితే ఇప్పుడిదే క‌థ ఆధారంగా తెలుగులో మ‌న్మ‌థుడు 2 తీస్తున్నార‌ని తెలిసింది.

గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌చ్చిన అజ్ఞాత‌వాసి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. త్రివిక్ర‌మ్ ఓ విదేశీ భాషా చిత్ర క‌థ ఆధారంగా అజ్ఞాతవాసి సినిమా తీశాడ‌ని తెలియ‌డంతో దాని గురించి ఆ చిత్ర యూనిట్ కు తెలిసి అప్ప‌ట్లో అది ర‌చ్చ అయింది. అయితే అప్ప‌ట్లో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగినా.. మ‌ళ్లీ మ‌న్మ‌థుడు 2 తో మ‌రోసారి కాపీ వివాదం తెరపైకి వ‌చ్చింది. అయితే మ‌న్మ‌థుడు 2 క‌థ‌ను నిజంగానే పైన చెప్పిన ఆ ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ చేశారా, లేదా.. అన్న వివ‌రాలు తెలియ‌లేదు. కానీ ఒక వేళ అదే నిజ‌మైతే ఆ చిత్ర యూనిట్ కూడా మ‌న్మ‌థుడు 2 బృందంపై కాపీ రైట్ వేస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే అది నిజ‌మో, కాదో తెలియాలంటే మ‌న్మ‌థుడు 2 విడుద‌ల అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news