రెండు వారాల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన 4200 కోట్ల రూపాయల బిల్లును క్లియర్ చేసింది. అందులో.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3000 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ప్రతిపాదనల మేరకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కాదు. జగన్ ప్రభుత్వం. అధికారం మారడమే కాదు.. ఏపీ రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. అవును… రెండో సారి ఎన్నికైన బీజేపీ కూడా ఏపీపై తన వైఖరిని మార్చుకున్నది. చంద్రబాబు హయాంలో అసలు ఏపీనే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం జగన్ అధికారంలోకి రాగానే ఏపీకి నిధుల వరద పారిస్తోంది.
రెండు వారాల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన 4200 కోట్ల రూపాయల బిల్లును క్లియర్ చేసింది. అందులో.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3000 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ప్రతిపాదనల మేరకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి పోలవరం జాతీయ ప్రాజెక్టు. అందుకే.. దాని నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తోంది. అయితే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మాత్రం పోలవరానికి కేంద్రం ఏం ఇవ్వట్లేదు.. అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందంటూ చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు 11,655 కోట్లలో కేంద్రం 6726 కోట్లను రిలీజ్ చేసింది. పెండింగ్ డబ్బును మాత్రం కేంద్రం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం పెండింగ్ డబ్బు 3000 కోట్లను రిలీజ్ చేసింది. మిగిలిన 1929 కోట్లను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా ఉపాది హామీ పథకం కింద 708 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మొత్తం కలిపి 4200 కోట్లను కేంద్రం విడుదల చేసింది.
మొత్తానికి జగన్ సీఎం కాగానే… ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కేంద్రం కూడా ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించింది. నిజంగానే జగన్ గ్రేట్. ఆయన సీఎం కాగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేస్తోంది.. ఇలాగే కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాలు ఉంటే త్వరలోనే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం ఖాయం.. అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.