మాస్ మహారాజ్ “ధమాకా” నుంచి మాస్ ట్రీట్ కి టైం ఫిక్స్.!

-

మాస్‌ మహారాజు రవితేజ వరుసగా సినిమాలు లైన్‌ లో పెట్టారు. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలు పెద్దగా హిట్టు కాకపోయినా.. ఎక్కడా తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నాడు రవితేజ. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ధమాకా, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు రవితేజ.

అయితే.. రవితేజ.. తన మాస్‌ యాంగిల్‌ చూపించేందుకు ధమాకా సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా థమాకా సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ గా ధమాకా మాస్ దావత్ ను ఈ సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషానికి రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది చిత్రం బృందం. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా వదిలింది. ఈ అప్డేట్ తో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news