‘ఆహా’ మాయా.. చిరుని వెన‌క్కి నెట్టిన అల్లు అర్జున్‌..!

-

దర్శక రత్న దాసరి నారాయణ రావు మరణానంతరం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద ఎవరు? అనేది చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ఈ విషయమై పెద్ద దుమారమే రేగింది. మెగాస్టార్ చిరంజీవియే ఇండస్ట్రీకి పెద్ద అనే వారు ఓ వైపున ఉండగా, మరో వైపున కొందరు మోహన్ బాబును పెద్దగా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఈ విషయమై ఇంకా ఎడతెరిపి లేని చర్చనే జరుగుతుందని చెప్పొచ్చు. అయితే, తాను ఇండస్ట్రీ పెద్దను కాదని, బిడ్డను మాత్రమేనని చిరంజీవి చెప్తున్నారు. కానీ, ఆయనే పెద్దని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఇంకా పలువురు ప్రముఖులు బహిరంగంగానే అంటున్నారు.

ఈ సంగతులు పక్కనబెడితే.. మెగాస్టార్ చిరంజీవి సొంత బావమరిది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ‘ఆహా’లోనూ చిరంజీవకి అవమానం జరుగుతున్నదని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో హీరోల పేర్లును (ఏ టు జెడ్)గా పేర్కొని అది ఒక ఆర్డర్ ప్రకారం పెట్టలేదని తెలిపారు. సాధారణంగా యాప్ డిజైన్ సందర్భంగా ఎవరికి సూచనలిచ్చినా తొలుత మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలయ్య అలా సీనియర్ హీరోల తర్వాత ఈ తరం యంగ్ హీరోల పేర్లను పెడతారు. కానీ, ఇక్కడ మాత్రం అలా జరగలేదు. తొలుత అక్కినేని నాగార్జున, ఆ తర్వాత బన్నీని పెట్టారు. ఆ తర్వాతనే మెగాస్టార్ చిరంజీవిని ఉంచారు. అలా ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని వెనక్కి నెట్టి అల్లు అర్జున్ ను ముందుకు తీసుకొచ్చారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టారు.

ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా చూసినా ఇది తప్పుల తడకగానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి గైడెన్స్, ఆయన సహకారంతో ఎదిగిన అల్లు అరవింద్.. ‘ఆహా’ యాప్‌లో యాక్టర్స్ పేర్లలో చిరంజీవి పేరును ఏ విధంగా బన్నీ తర్వాత పెట్టారని మెగా అభిమానులు చిందులు తొక్కుతున్నారు. అల్లు అరవింద్, బన్నీలు కావాలనే చిరంజీవిని అవమానిస్తున్నారని, తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారని అంటున్నారు. రామ్ చరణ్ పేరును ఎక్కడో దూరాన పడేశారని వివరిస్తున్నారు.

వ్యాపార పరంగా, సినిమా మేకింగ్ లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే అల్లు అరవింద్ కాని అల్లు అర్జున్ కాని ఈ విషయమై ఎందుకు కాన్సంట్రేట్ చేయలేదు? అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే వారు చిరంజీవిని త‌గ్గించే ప్రయత్నం చేశారా? అనే విషయాలపై మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ‘ఆహా’ ఏమి మాయాజాలం.. ఇది.. ‘చిరు’ సహకారంతో ఎదిగే దాకా ఓ మాట ఎదిగానక మరొక మాట అన్నట్లుగా అల్లు అరవింద్, అర్జున్‌ల వ్యవహారం ఉందని మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ‘ఆహా’ యాప్‌లో చిరంజీవికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇండస్ట్రీకి కష్టమొస్తే వచ్చి ఆదుకుని, బిడ్డగా ముందుకు నడిపించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని వివరిస్తున్నారు. చూడాలి మరి ఈ ‘ఆహా’ యాప్ విషయమై అల్లు అరవింద్, బన్నీలు ఏ విధంగా స్పందిస్తారో..

Read more RELATED
Recommended to you

Latest news