అఫీషియల్: మెగా అప్‌డేట్..‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి వచ్చేస్తున్నాడు..ఎప్పుడంటే?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ చిరు నటిస్తున్న సినిమా అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

చిరంజీవి నటిస్తున్న 154 వ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఊర మాస్ అవతార్ లో చిరంజీవి ఇందులో కనిపిస్తారని తెలుస్తోంది. కాగా, సర్ ప్రైజ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. తమ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ మేరకు వారు ట్వీట్ చేశారు.

జూన్ 24న(శుక్రవారం) 11.07 గంటలకు మెగా 154 అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. ‘మెగా తుపాను’ రాబోతున్నదని పేర్కొన్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. హీరోయిన్ గా టాలెంటెడ్ శ్రుతిహాసన్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news