‘థాంక్యూ’ ప్రమోషన్స్ స్టార్ట్..నాగచైతన్య, రాశి ఖన్నాల చిట్ చాట్

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘బంగార్రాజు’,‘లవ్ స్టోరి’ ఫిల్మ్స్ తో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో..ఇటీవల తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 22వ సినిమా ‘NC 22’ స్టార్ట్ చేశాడు. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టి ఫైనల్ అయింది. మరో వైపున తను నటించిన ‘థాంక్యూ’ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు.

అక్కినేని ఫ్యామిలీ తో విక్రమ్ కె కుమార్ తీసిన ‘మనం’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆయన దర్శకత్వంలో ..నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘థాంక్యూ’. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తు్న్న ఈ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్ , టీజర్ ఇచ్చేశారు దర్శకుడు విక్రమ్ కె.కుమార్.

వచ్చే నెల 8న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట చేశారు. మీడియా చానల్స్ తో నాగచైతన్య, రాశి ఖన్నా ముచ్చటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘థాంక్యూ’ సినిమాకు స్టోరి బీ.వీ.ఎస్.రవి అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news