Flash : జమున బయోపిక్ లో మిల్కీ బ్యూటీ తమన్నా !

-

సీనియర్ సీని నటి జమున అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య నిన్ననే ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వాహించారు.

జమున నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల జమున కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, నిన్న సాయంత్రం నగరంలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జమున అంత్యక్రియలు నిర్వహించారు.

జమునకు కుమార్తె స్రవంతి రావు అంతిమసంస్కారాలు జరిపారు. విదేశాల నుంచి జమున కుమారుడు వచ్చేందుకు సమయం పడుతుండడంతో, కుమార్తె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, జమున మృతి తర్వాత.. ఆమె జీవితం ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కనుందట. ఈ సినిమాలో తమన్నా నటించనుందట. జమున పాత్రలో తమన్నా కనివిందు చేయనుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news