మిస్టర్ ‘మజ్ను’ అనిపించుకున్న అఖిల్

-

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు డైరెక్టర్. వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ పతాకంపై ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ రిలీజయి యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. టీజర్‌లాగానే.. ట్రైలర్‌లో కూడా అఖిల్.. డ్యాన్స్, ఫైట్స్‌తో అలరించాడు. అఖిల్ నటించిన రెండు సినిమాలు అంతగా ఆడకున్నప్పటికీ.. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. అఖిల్ కూడా ఈ సినిమాకు చాలెంజింగ్‌గానే తీసుకున్నాడు. ఈ సినిమాలో హైపర్ ఆది, ప్రియదర్శి, నాగబాబు తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news