పెళ్లికూతురుగా ముస్తాబైన హన్సిక వీడియో వైరల్..!!

కోలీవుడ్ హీరోయిన్ హన్సిక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. తెలుగులో దేశముదురు సినిమా ద్వారా మొదట ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి హీరోయిన్గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించింది హన్సిక. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి హీరోయిన్ హన్సిక వివాహ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎట్టకేలకు పెళ్లికూతురు గెటప్ లో హన్సిక కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

మరికొన్ని గంటల్లో హన్సిక సింగిల్ లైఫ్ కి పుల్ స్టాప్ పెట్టి తన ప్రియుడు సోహెల్ తో ఏడడుగులు వేయబోతోంది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం అంగరంగ వైభవంగా కుటుంబ పెద్దల సమక్షంలో జరగబోతోంది. ఇప్పటికే కళ్యాణ మండప వేదిక వద్దకు చేరుకున్న వధూవరుల కుటుంబ సభ్యులతో కలసి హన్సిక మెహందీ ఫోటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఈ వేడుకలలో నూతన వధూవరులు హన్సిక, సోహెల్ పాల్గొనడం జరిగింది.

నిన్నటి రోజున జరిగిన ఈ వేడుకలలో ఈ జంట ముస్తాబయి అందరినీ బాగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇంస్టాగ్రామ్ లో తెలియజేయడం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకొస్తు..” నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను ఇప్పటికీ ఎప్పటికీ నీతోనే ఉంటానని తెలియజేశారు సోహైల్”.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతొంది. హన్సిక , సోహైల్ వివాహం రాజస్థాన్ జైపూర్ లో ఒక రాజకోటలో జరగబోతోంది.వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya)