మజిలీ ఫస్ట్ వీక్ కలక్షన్స్.. దుమ్ముదులిపేసిన చైతు, సమంత..!

-

నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కశిక్ నటించిన ఈ సినిమాలో ముగ్గురు తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంతలు మజిలీకి ప్రాణం పోశారు. రియల్ లైఫ్ లో భార్యా భర్తలైన వారు సినిమాలో భార్యాభర్తలుగా నటించడం క్రేజీగా మారింది.

ఇక ఈ సినిమా రిలీజైన మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక వసూళ్ల పరంగా కూడా చైతు కెరియర్ బెస్ట్ అయ్యేట్టు ఉంది. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన మజిలీ ఫస్ట్ వీక్ కలక్షన్స్ లో 26 కోట్లను రాబట్టింది. ఏరియాల వారిగా మజిలీ వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 9.05 కోట్లు
సీడెడ్: 2.82 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.07 కోట్లు
కృష్ణ: 1.45 కోట్లు
గుంటూరు: 0.63 కోట్లు
ఈస్ట్ : 1.30 కోట్లు
వెస్ట్: 0.99 కోట్లు
నెల్లూరు: 0.57 కోట్లు

ఎపీ/ తెలంగాణా : 20.88 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.50 కోట్లు

ఓవర్సీస్: 2.75 కోట్లు

వరల్డ్ వైడ్ : 26.13 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news