రాజమౌళినే ఛాలెంజ్ చేస్తున్న కంగనా..!

-

బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత టాలెంట్ ఉంటుందో అదే రేంజ్ లో వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది. బాలీవుడ్ స్టార్స్ హీరోల మీద ఎప్పుడు నోరు పారేసుకునే కంగనా లేటెస్ట్ గా అలియా భట్ ను చెత్త అనడం బీ టౌన్ లో హాట్ న్యూస్ అయ్యింది. రీసెంట్ గా మణికర్ణిక సినిమాతో సత్తా చాటిన కంగనా ఆ సినిమాలో నటించడమే కాకుండా డైరక్షన్ లో కూడా సత్తా చాటింది.

ఇక ఇప్పుడు జయలలిత బయోపిక్ తలైవి సినిమాలో నటిస్తున్న కంగనా ఆ సినిమా తర్వాత ఓ చారిత్రాత్మక సినిమాలో నటిస్తానని చెబుతుంది. ఆ సినిమా కూడా తన డైరక్షన్ లోనే వస్తుందని తెలిపింది. అంతేకాదు ఈ సినిమా బాహుబలి, పద్మావత్ సినిమాలకు ధీటుగా ఉంటుందని చెప్పుకొచ్చింది కంగనా. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమా త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందట.

డైరక్టర్ గా కంగనా పెద్ద బాధ్యతనే మీద వేసుకుంది. మరి బాహుబలిని క్రాస్ చేసే సినిమా అంటే రాజమౌళికి కంగనా చాలెంజ్ విసిరినట్టే. మరి అమ్మడు ఓ పక్క నటిగా మరోపక్క డైరక్టర్ గా ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news