నాగచైతన్య ‘థాంక్యూ’ విడుదల తేదీలో మార్పు..అధికారిక ప్రకటన

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’ వచ్చే నెల 8న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కాగా, మేకర్స్ తాజాగా విడుదల తేదీని మార్చేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో అధికారిక ప్రకటన ఇచ్చారు.

 

వచ్చే నెల 22న ‘థాంక్యూ’ పిక్చర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ కు ‘మనం’ ఫేమ్ విక్రమ్ .కె.కుమార్ దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అవికా గోర్‌ మరో కీలక పాత్ర పోషించింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సక్సెస్ పైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బీవీఎస్ రవి ఈ పిక్చర్ కు స్టోరి అందించారు. నాగచైతన్య ఈ ఏడాది ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ తో సక్సెస్ అందుకున్నాడు. ప్రేక్షకులకు చివరగా చైతన్య..ఆ సినిమాలో కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news