విడాకుల‌పై కడుపుబ్బా నవ్వించే నాగ‌బాబు వీడియో.. మామూలుగా లేదుగా..!

277

పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినప్పటికీ… తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అదే సమయంలో నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. వీటన్నింటి వల్ల రాని గుర్తింపును బుల్లితెరపై జబర్ధస్త్‌కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంపాదించుకున్నారు. ఇక నాగబాబు ఇటీవలె ఈటీవీలో ప్రసారమయ్యే సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ను వీడి.. జీ తెలుగులో కొత్తగా ‘అదిరింది’ వేదికపైకి ఒచ్చినట్టు ప్రకటించారు నాగబాబు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. పిల్లల విడాకులకు పెద్దలు ఎలా కారణమవుతున్నారో తెలుపుతూ మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన ప్రసంగం నవ్వులు పూయిస్తోంది.

నిత్యజీవితంలో వేదాంతంపై, వ్యక్తిత్వ వికాసంపై గరికపాటి చేసిన ఈ అద్భుత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జీవిత సత్యాలని ఖరా ఖండిగా, గొప్పగా, అద్భుతమైన హాస్యంతో చెప్పిన శ్రీ గరికపాటి నరసింహరావు గారు. 28 నిమిషాల నాన్‌స్టాప్‌ హాస్యాన్ని అద్భుతమైన నిజాలతో చెప్పారు. 28 నిమిషాల హాస్యం గ్యారంటీ.. నవ్వకపోతే నేను గ్యారంటీ…’ అంటూ నాగబాబు ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘జబర్దస్త్.. అదిరింది కన్నా అద్భుతంగా ఈ హాస్యం ఉంది’ అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.