ఇండస్ట్రీకి వరం ఎన్టీఆర్

-

తెలుగు పరిశ్రమకు ఎన్.టి.ఆర్ ఓ వరం అంటుంది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో మొదలైన ఆమె కెరియర్ స్టార్ హీరోల సరసన నటించే రేంజ్ కు వచ్చింది. చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, మహేష్ లాంటి స్టార్స్ తో నటించిన రకుల్ వారి గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఒక్క మాటలో చెప్పింది. అందులో భాగంగా ఎన్.టి.ఆర్ గురించి చెబుతూ ఇండస్ట్రీకి దొరికిన ఓ వరం అంటూ చెప్పుకొచ్చింది.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ క్రేజ్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. స్టార్ రేసులో ఎప్పుడు ముందుండే తారక్ ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫాం లో ఉన్నాడు. అలాంటి తారక్ ను తన తోటి నటీనటులు ఇష్టపడటం కూడా కామనే. అందులో రకుల్ కూడా ఒకరని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ ఇండస్ట్రీకి ఓ వరం అతనో మంచి డ్యాన్సర్ అంటూ తారక్ పై తనకున్న ఇంప్రెషన్ చెప్పేసింది.

ఇక చెర్రి చిన్నపిల్ల మనస్థత్వం కలవాడని.. మహేష్ మంచి ఫ్యాషనేట్ హీరో.. బన్ని అద్భుతాలు సృష్టించగల సమర్ధుడని తను నటించిన అందరి స్టార్స్ గురించి చెప్పింది రకుల్. స్పైడర్ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయల్ని ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో శ్రీదేవి పాత్రలో నటిస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news