ధనుష్, నాగార్జున మూవీ టైటిల్ ఫిక్స్

-

దేవదాస్ సినిమా తర్వాత నాగార్జున మరో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడని తెలిసిందే. ఈసారి కోలీవుడ్ లో నాగ్ క్రేజీ మల్టీస్టారర్ షురూ చేశాడు. అక్కడ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నాగార్జున కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున మాత్రమే కాదు ఎస్.జే సూర్య, శ్రీకాంత్, అదితి రావు హైదరిలు నటిస్తున్నారట.

శ్రీ తేనాండల్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు టైటిల్ గా నాన్ రుద్ర అని పెట్టబోతున్నారట. ధనుష్ రాసిన కథకు నాగార్జున ఫిదా అయ్యాడట. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా నాగార్జున పార్ట్ వరకు ఈ ఇయర్ కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఈ నాన్ రుద్ర తెలుగు టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. మరి అదే తెలుగులో నేనే రుద్ర అని రిలీజ్ చేస్తారా లేక మరేదైనా టైటిల్ పెడతారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news