పవన్ సినిమా అక్కడ సూపర్ హిట్

-

అదేంటి పవన్ ఈమధ్యలో ఏ సినిమా చేయలేదు కదా ఆయన నటించిన లాస్ట్ మూవీ అజ్ఞతావాసి కూడా డిజాస్టర్ అయ్యిందే మరి అలాంటిది పవన్ సినిమా ఎలా సూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ పవన్ పొలిటికల్ సినిమా ఆంధ్రాలో హిట్ అవుతుందా.. లేక మరేదైనా విషయం ఉందా అని డౌట్ రావొచ్చు. ఇది కచ్చితంగా పవన్ సినిమాకు సంబందించిన వార్తే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ డైరక్టర్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. 2018 జనవరిలో రిలీజైన ఈ సినిమా వాక్సాఫీస్ ఫైట్ లో ఢీలా పడింది. అయితే హింది డబ్బింగ్ వర్షన్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. తెలుగు సినిమాలు హిందిలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడుతుంటారు. అదేంటో మన సినిమాల డబ్బింగ్ వర్షన్స్ యూట్యూబ్ లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడ్డాయి.

బన్ని సరైనోడు సినిమా కూడా హిందిలో హిట్ అయ్యింది. ఇప్పుడు అజ్ఞాతవాసి కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన 48 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. 3 రోజుల్లో ఈ సినిమా 22 మిలియన్ వ్యూస్ సాధించింది. హింది డబ్బింగ్ వర్షన్ లో ఎవడు 3 గా రిలీజైన ఈ సినిమా యూట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news