దేవదాస్ కోసం కత్తెర పట్టిన నాగార్జున

-

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ దేవదాస్ పై అంచనాలను పెంచేసింది. డాన్ దేవాగా నాగార్జున, డాక్టర్ దాసుగా నాని నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలను మీద వేసుకున్నాడట నాగ్. సినిమా దర్శకుడు శ్రీరాం ఆదిత్య తీసిన భలే మంచి రోజు, శమంతకమణి రెండు యువ హీరోల సినిమాలే. అందుకే స్టార్స్ ను యాండిల్ చేయడంలో కాస్త తడబడ్డాడట. షూటింగ్ ఎలాగు పూర్తయింది కాబట్టి నాగార్జున ఎడిటింగ్ లో కొన్ని మార్పులు చేస్తున్నాడట. అశ్వనిదత్ తో ఇదవరకు చాలా సినిమాలు చేసిన చనువు కొద్ది నిర్మాత కూడా నాగార్జున చెప్పిన సూచనలను పాటించాలని దర్శకుడికి చెప్పాడట.

మొత్తానికి అలా దేవదాస్ కు నాగార్జున కత్తెర పట్టాల్సి వచ్చింది. మహానటి తర్వాత అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి. ఆకాంక్ష సింగ్ రష్మిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version