గోవాలో ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న “నాగిని” బ్యూటీ

నాగిని సీరియల్‌ ఫేం, బుల్లి తెర నటి మౌనీరాయ్‌ ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్‌ నంబియార్‌ ను వివాహం చేసుకుంది. ఇవాళ ఉదయం మలయాళీ సాంప్రదాయ పద్దతిలో వీరిద్దరి పెళ్లి గోవాలో జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఇందులో మౌనీరాయ్‌ తెలుపు రంగు పట్టు చీరలో మెరిసిపోతుండగా.. సూరజ్‌ గోధుమ రంగ షేర్వాణీలో పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. నిజానికి మౌనీరాయ్‌ తన పెళ్లిని దుబాయ్‌ లో జరుపుకోవాలని అనుకున్నట్లుసమాచారం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే తన వివాహాన్ని గోవాలో జరుపుకుంది. గత రెండు రోజులుగా వీరి పెళ్లి పనులకు సంబంధించిన వీడియోలు నెట్టిం వైరల్‌ కాగా.. ఇవాళ పెళ్లి ఫోటోలు వైరల్‌ అయ్యాయి. కాగా.. మౌనీరాయ్‌, వ్యాపారవేత్త సూరజ్‌ నంబియార్‌ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.