సత్తా చాటిన భారతీయుడు..ఏడో సారి ఆస్కార్ అందుకున్న నమిత్ మల్హోత్ర..

-

సినిమా ప్రపంచంలో మెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు ‘ఆస్కార్’. ఈ పురస్కారం అందుకున్నట్లయితే ఇక జీవితంలో సాధించాల్సింది ఏమీ లేదని అనుకునేవాళ్లు బోలెడు మంది ఉంటారు. అలా ఏదో ఒక రోజు ఆస్కార్ అందుకోవాలని కలలు కనేవారు కూడా ఉంటారు. అయితే, ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులన్నీ కూడా విదేశీ భాషలకు, విదేశీయులకు వెళ్లాయి. భారత దేశానికి కూడా అవార్డులు వచ్చాయి. కానీ, వచ్చిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి.

తాజాగా ఓ ఇండియన్ కు ఆస్కార్ అవార్డు రాగా, అది ఆయనకు ఏడో ఆస్కార్ పురస్కారం కావడం విశేషం. హాలీవుడ్ మూవీ ‘డ్యూన్’కు ఈ అవార్డు వచ్చింది. ఈ చిత్రానకి మొత్తం విభాగాల్లో కలిపి ఏడు అవార్డులు వచ్చాయి. ‘డ్యూన్’ చిత్రానికి విజ్యువల్ ఎఫెక్ట్స్ చేసిన కంపెనీ ‘డీఎన్ఈజీ’ కాగా, ఈ కంపెనీ చైర్మన్ ఇండియన్ అయిన నమిత్ మల్హోత్ర కావడం విశేషం.

నమిత్ మల్హోత్రా.. ఫ్యామిలీ మూవీ మేకింగ్‌లోనే పనిచేస్తోంది. డ్యూన్‌కు అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశాడు. విజ్యువల్ ఎఫెక్ట్స్ అనేవి కథ చెప్పడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పాడు. రానున్న రోజుల్లో విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రస్తావన వస్తే.. ‘డ్యూన్‌’ చిత్రానికి ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకుంటారేమోనని తెలిపాడు. తాను ఇండియాలోని ముంబైలో ఓ చిన్న షెడ్‌తో తన బిజినెస్‌ను స్టార్ట్ చేశానని గుర్తు చేసుకున్నాడు.

హాలీవుడ్‌లోనూ జీరో నుంచి తన జర్నీ స్టార్ట్ చేశానని, ఆస్కార్ అవార్డు సాధించడం ద్వారా భారతీయులు సాధించలేనిది అంటూ ఏదీ ఉండబోదని అనిపిస్తున్నదని వివరించాడు. విజ్యువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో నమిత్ మల్హోత్రా డీఎన్‌ఈజీ కంపెనీకి ఇప్పటికే 6 ఆస్కార్ అవార్డులు రాగా, ‘డ్యూన్‌’ చిత్రానికి 7వ అవార్డు అందుకున్నాడు నమిత్ మల్హోత్ర. భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని అన్నాడు మల్హోత్ర. ఇకపోతే ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ విజ్యువల్ వండర్ గా ఉండటం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news