పెరుగు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు..కానీ కొంతమందికి పెరుగు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ వాసన కూడా నచ్చదు. వీళ్లు ఒక బ్యాచ్ అయితే..ఇంకొంమంది ఉంటారు..భోజనాన్ని పెరుగుతోనే ముగిస్తారు. అదేంటో పెరుగన్నం తినకుండా భోజనం చేస్తే వారికి అసలు తిన్నట్లే ఉండదు. ఇలా ఉంటారు. నిజానికి పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. కానీ..పెరుగు అందరికి మంచిది కాదంటున్నారు నిపుణులు. వీళ్లు పెరుగుతింటే…అది విషంతో సమానమట. ఇంతకీ ఆ జాబితాలో ఎవరు ఉన్నారు..వాళ్లు ఎందుకు పెరుగుతినకూడదో చూద్దాం.
పెరుగు తినడం ద్వారా మీ శరీరానికి కావల్సినంత కాల్షియం లభిస్తుంది. తద్వారా మీ ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కానీ మీకు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు..పెరుగు అస్సలు తినకూడదు. ఒకవేళ తినట్లయితే. సమస్య మరింతగా పెరుగుతుందట..
జీర్ణవ్యవస్థకు పెరుగు చాలా మంచదని మన పెద్దోళ్లు కూడా చెబుతుంతారు.. అయితే అసిడిటీ సమస్య ఉన్నట్లయితే పెరుగు అస్సలు తినకూడదు… ఒకవేళ తింటే అజీర్ణం కావొచ్చు. రాత్రి సమయాల్లో కూడా పెరుగును తినకపోవడమే మంచిది.
ఆస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే పెరుగుకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎవరైనా లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ తో బాధపడుతున్నట్లయితే.. వారు కూడా పెరుగును తినవద్దు. అతిసారం లేదా కడుపు నొప్పి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
ఈ జాబితాలో ఉన్న రోగులు కేవలం పెరుగుకే కాదు..పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండటం మంచిది. అలా అని..పాల ఉత్పత్తులును కంప్లీట్ గా మీ జీవితంలోంచి తీసేయమని కాదు..వీలైనంత వరకు తగ్గించండి. పెరుగును మాత్రం తీసుకోకపోవటం మంచిదంటున్నారు వైద్యులు.