ట్రెండ్ ను ఫాలో అవుతున్న నమిత… అలాంటి బిజినెస్ లోకి ఎంట్రీ…

తన అందాలతో ఎక్స్ పోజింగ్ తో ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన నమిత(Namitha)ను ఎప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోలేరు. కొంత కాలం పాటు ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందాల ఆరబోతే మెయిన్ ఎజెండాగా పెట్టుకుని అవకాశాలు సాధించుకుంది. ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తూ… కుర్రకారు మతులు చెడగొట్టిన ఈ ముద్దు గుమ్మ 2017లో తన ప్రియుడైన వీరేంద్రను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా ఈ అమ్మడుకి ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇక ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ భౌ భౌ అనే మూవీలో నటిస్తున్నట్లు తెలిపింది. అది మాత్రమే కాకుండా ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయిందని పేర్కొంది.

నమిత /Namitha

అసలు విషయంలోకి వస్తే… ఈ అమ్మడు తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ చేస్తుందట. నమిత ప్రొడక్షన్స్ , నమిత ఓటీటీ యాప్ ను ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాచారం. విక్టరీ వెంకటేశ్ సరసన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత తమిళం, కన్నడ, హిందీ మూవీల్లో కూడా ఆడిపాడింది. అయితే ఈ అమ్మడు ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చినపుడు నాజుగ్గా ఉండగా… రాను రాను విపరీతంగా బరువు పెరిగింది. దీంతో తన శరీరాకృతిని కూడా కోల్పోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. అయినా కూడా అడపాదడపా వచ్చిన అవకాశాలతో తన అందాల ఆరబోతను ప్రదర్శించింది. ఇలాగే సీనియర్ హీరో బాలయ్య బాబు సరసన సింహ అనే మూవీలో ఈ చిన్నది నటించింది. ఇందులో కూడా తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ అందులో ఈ అమ్మడుకి ఏ మాత్రం క్రెడిట్ దక్కలేదనే చెప్పాలి.