బ్రేకింగ్ న్యూస్ : నందమూరి హరికృష్ణ మృతి.. విషాదంలో నందమూరి ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్

-

ఈరోజు తెల్లవారుఝామున నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిని హీరో, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఆయన నల్గొండ జిల్లా అన్నెపర్తిలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించలేదట.. దాన్ని తప్పించబోయే డివైడర్ ఎక్కించి అలా రోడ్డు పక్కన పల్టీలు కొట్టడం జరిగిందట. జరిగిన ఘోరం లో కారులోంచి హరికృష్ణ రోడ్డు మీద పడ్డారు.

తలకు, చాతి భాగంలో విపరీతమైన గాయాలయ్యాయట. దగ్గరలో ఉన్న నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లగా కొద్దినిమిషాలకే ఆయన మరణించారన్న వార్త బయటకు వచ్చింది. నందమూరి హరికృష్ణ మరణం సిని, రాజకీయ వర్గాలను విషాదానికి గురి చేసింది. మరణవార్త విన్న ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ఇద్దరు హుటాహుటిన హాస్పిటల్ కు బయలుదేరారని తెలుస్తుంది. ఈ సంఘటనతో నందమూరి ఫ్యాన్స్ లో కూడా విషాద చాయలు అలముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news