ఇటీవలే జరిగిన హైదరాబాద్, బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్‌లో కెమెరా కళ్లు ఒక్కసారిగా ఓ యువతిపై పడ్డాయి. దీంతో ఆ యువతి ఆ మ్యాచ్‌కే కాదు, ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ లా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది.

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మనకు క్షణాల్లో తెలిసిపోతోంది. అలాగే సాధారణ వ్యక్తులు కూడా ఓవర్‌నైట్ స్టార్లు అయిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా అందుబాటులో ఉండడమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే గతంలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకే ఒక కన్నుగీటుతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది. అయితే ఆమే కాదు… పలు దేశాల్లో కొందరు వ్యక్తులు కూడా ఇలాగే ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు.
@imVkohli Please invite this girl for all the ipl matches next year…you never know lady luck????@IPL @RCBTweets
#RCBvSRH pic.twitter.com/Wvo1cEfudw
— Cezane Syed (@Iamcezane) 4 May 2019
ఇక తాజాగా మన దేశానికి చెందిన మరో యువతి కూడా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఇటీవలే జరిగిన హైదరాబాద్, బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్‌లో కెమెరా కళ్లు ఒక్కసారిగా ఓ యువతిపై పడ్డాయి. దీంతో ఆ యువతి ఆ మ్యాచ్‌కే కాదు, ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ లా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. ఈ క్రమంలోనే ఆ యువతి ఇన్‌స్టాగ్రాం ఖాతాకు ఒక్కరోజులోనే 1.50 లక్షల మంది ఫాలోవర్లు కొత్తగా యాడ్ అయ్యారు.
సన్‌రైజర్స్, ఆర్‌సీబీ మ్యాచ్‌లో మెరిసిన దీపికా ఘోష్ అనే ఆ యువతి ఇప్పుడు భారతీయ యువకులకు నేషనల్ క్రష్ అయింది. దీంతో ఇకపై ఆర్‌సీబీ ఎప్పుడు మ్యాచ్‌లు ఆడినా.. ఆ యువతిని కచ్చితంగా మ్యాచ్‌లకు ఆహ్వానించాలని, దీంతో ఆర్‌సీబీ కచ్చితంగా గెలుస్తుందని, ఆ టీం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. సోషల్ మీడియా పుణ్యమా అని మరో ఓవర్ నైట్ స్టార్ మన ముందుకు వచ్చింది.. ఇక ఆమె ముందు ముందు ఎలాంటి సెన్సేషన్లు క్రియేట్ చేస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!