విజయ్ దేవరకొండ రూట్ లో నాని

యువ హీరో విజయ్ దేవరకొండ రూట్ లో నాని వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండ చేసిన ఐదారు సినిమాలకే సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక తను చేసే ప్రతి సినిమాలో లిప్ లాక్ ఉండేలా జాగ్రత్త పడుతున్న విజయ్ దేవరకొండ మిగతా హీరోలకు మార్గ దర్శకుడిగా మారాడు. యువతను మెప్పించే ఏకైక అస్త్రం లిప్ లాక్ విజయ్ ప్రతి సినిమాలో అది కచ్చితంగా ఉంటుంది. అందుకే అతని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు విజయ్ లిప్ లాక్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు నాచురల్ స్టార్ నాని. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో నాని హీరోగా వస్తున్న జెర్సీ సినిమా నుండి సాంగ్ రిలీజైంది. అదేంటో గాని ఉన్నపాటుగా అంటూ సాగే ఈ పాటని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సాంగ్ లో నాని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తో లిప్ లాక్ చేశాడు. సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అజ్ఞాతవాసి తర్వాత అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ జెర్సీ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ అవుతుంది.