తండ్రి కొడుకులిద్దరికి ఆమే కావాలట..!

సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు ఇప్పుడు వెరైటీ సమస్య వచ్చి పడ్డది.. అసలకే సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం లేదని తెలిసిందే. అయితే ఈ టైంలో ఒకే హీరోయిన్ ను అటు తండ్రి.. ఇటు కొడుకు హీరోయిన్ గా చేయాలని అడిగారట. ఇంతకీ ఆ తండ్రి కొడుకు ఎవరు..

ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరు అంటే వాళ్లు అక్కినేని హీరోలు.. ఆ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అని తెలుస్తుంది. కింగ్ నాగార్జున మన్మధుడు 2 సినిమాలో నాగ్ సరసన రకుల్ ను కన్ ఫాం చేశారట.మరోపక్క వెంకటేష్ తో కలిసి నాగ చైతన్య చేస్తున్న సినిమాలో చైతుకి జోడీగా రకుల్ ను అనుకుంటున్నారట.అయితే ఒక సినిమాలో తండ్రికి మరొక సినిమాలో కొడుక్కి జోడీగా నటించడం ఒకప్పుడు జరిగింది. కాని ఇప్పుడు అలా చేసేందుకు హీరోయిన్స్ సమ్మతంగా లేరట. అందుకే నాగార్జున మమధుడు 2కి ఓకే చెప్పి చైతు సినిమాకు సారీ చెప్పిందట. ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ చైతుతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించింది. నాగ్ సరసన నటించేందుకు రకుల్ దాదాపు కోటిన్నర దాకా తీసుకుంటుందని తెలుస్తుంది.