‘అష్టా చెమ్మా’ ఫేమ్ నాని..ఆ మూవీతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత నటించిన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం తెలుగు చిత్ర సీమలో ఏర్పరుచుకున్నాడు నాని. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుని ప్రజెంట్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.
తెలుగు చిత్ర సీమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన నాని..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ గతంలో ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఈగ’ చిత్రం లో నటించాడు.
సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే నాని ఇటీవల కాలంలో చాలా యాక్టివ్ అయిపోయారు. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో గుబురు గడ్డంతో బ్యాక్ లుక్ ఫొటోలు షేర్ చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోలు చూసి ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండలా ఉన్నావంటూ, విజయ్ దేవరకొండకు కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు నాని అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాని ..శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పిక్చర్ కోసమే నాని గడ్డం పెంచినట్లున్నాడు. నాని నటించిన ‘అంటే సుందరానికి ’ వచ్చే నెల 10న విడుదల కానుంది.
View this post on Instagram