వామ్మో..షాకింగ్ న్యూస్..ఆ సినిమాకు ఏడు సీక్వెల్స్ ఉంటాయంటున్న స్టార్ హీరో

-

శైలేశ్ కొలను దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన ‘హిట్’ సినిమా.. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. ఈ పిక్చర్ తో శైలేశ్ కొలను టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ పైన నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేశారు.

ఈ క్రమంలోనే ‘హిట్’ సినిమాకు సీక్వెల్ రాబోతున్నది. దానిని కూడా నానినే ప్రొడ్యూస్ చేశారు. జూలై 29న హిట్ ద సెకండ్ కేస్ విడుదల కానుంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్స్ నాని తన సినిమా ‘అంటే సుందరానికి’ ప్రమోషన్స్ లో చెప్పేశారు.

వాల్ పోస్టర్ బ్యానర్ పై డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ప్రజలకు అందించాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ‘హిట్ 2’ సీక్వెల్ రాబోతున్న క్రమంలోనే ఆ సినిమాకు మొత్తం ఏడు సీక్వెల్స్ తీసే ఆలోచన ఉన్నట్లు వివరించారు. అందులో ఏదో ఒక దానిలో తాను హీరోగా నటించొచ్చని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేనని, సరైన టైమ్ వచ్చినపుడు అన్ని విషయాలు చెప్తానని అన్నాడు నేచురల్ స్టార్ నాని. నాని, నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికి’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news