7th pay commission: వచ్చే నెలలో ఉద్యోగులకు డీఎ 39 శాతానికి పెరిగే అవకాశం..!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది..ఈ ఏడాది రెండవ డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ఊహించిన దాని కంటే ఎక్కువ జీతాలను అందుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఇప్పటికే పలు మార్లు చర్చలు కూడా జరిగాయి.ముందుగా ఊహించిన DA పెంపు 4 శాతం అయితే, పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన ఇటీవలి ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచిక లేదా CPI డేటా కారణంగా ఈ సంఖ్య పెరగవచ్చు. ప్రస్తుతం, డీఏ 34 శాతంగా ఉంది.

 

ముందుగా ఊహించిన దానికన్నా ఎక్కువే అంటే 38 శాతం కంటే ఎక్కువ అంటే 39 శాతం ఉండవచ్చునని అంచనా..తాజా నివేదికలు ఈ పెరుగుదల 5 శాతం కంటే ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ఇది ఏప్రిల్ 2022కి సంబంధించిన ఆల్-ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా రూపొందించబడింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పేరుతో ద్రవ్యోల్బణం నుంచి పొందే ఉపశమనం జూలైలో మరింత పెరగవచ్చు. అంచనా వేసిన 4 శాతం పెంపుతో, ఈ మొత్తాన్ని బేసిక్ జీతం ఆధారంగా రూ.8,000 నుండి రూ.27,000 వరకు లెక్కించారు. 5 శాతం పెంపుదల అంటే కొత్త డీఏ రేటు 39 శాతంగా ఉంటుంది..

ఈ నేపథ్యంలో కేంద్రం ఆద్వర్యంలో శ్రామికశక్తికి భారీ ప్రోత్సాహాన్ని అందించనుంది. 3 శాతం పెంపుతో 31 శాతం నుంచి 34 శాతానికి పెంచినప్పుడు 2022 మొదటి డిఎ సవరణను ప్రభుత్వం మార్చిలో ప్రకటించింది. డిసెంబర్ 2021లో 125.4గా ఉన్న ఎఐసిపిఐ జనవరి 2022లో 125.1కి పడిపోయింది, ఆ తర్వాత ఫిబ్రవరిలో 125కి పడిపోయింది. మార్చిలో సంఖ్య 126. ఏప్రిల్‌లో, ఎఐసిపిఐ గణనీయమైన జంప్‌లో 127.7కి పెరిగింది. ఏప్రిల్‌కు సంబంధించిన ఎఐసిపిఐ డేటాతో, జూలైలో ముందుగా ఊహించిన 4 శాతానికి బదులుగా ప్రభుత్వం 5 శాతం పెంపును ప్రకటించవచ్చని నివేదికలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news