నాని ఫాన్స్ కు గుడ్ న్యూస్ : శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని ఇటీవల టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టుగా ఓఓటి లో రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దానికి సంబంధించి… శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. అంటే సుందరానికి సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, మృతి శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. దసరా పండుగ కానుకగా ఈ సినిమా నుంచి ఈ అప్డేట్ ఇచ్చేసింది చిత్రబృందం. అది ఏంటంటే శ్యామ్ సింగ రాయ్ సినిమాను డిసెంబర్ మాసంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం. అంతేకాదు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా చిత్ర బృందం ఈ ప్రకటన చేసింది. అయితే విడుదల తేదీ ని మాత్రం బృందం ఫిక్స్ చేయలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనుంది.