కేంద్రం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తోంది… బీఎస్ఎఫ్ పరిధి పెంపుపై త్రుణమూల్ కాంగ్రెస్

-

విదేశీ సరిహద్దుల గుండా బీఎస్ఎఫ్ జూరిస్డిక్షన్ పరిధిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయమే కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. త్రుణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య విమర్శలను పెంచేలా చేసింది. కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకుండా బీఎస్ఎఫ్ పరిధిని పెంచిందని, ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అని త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది దేశ సమాఖ్య స్పూర్తిని భంగం కల్గించడమే అని టీాఎంసీ స్పోక్స్ పర్సర్ కునాల్ ఘోష్ అన్నారు. మానవ హక్కుల విషయంలో బీఎస్ఎఫ్ కు సరైన రికార్డు లేదని టీఎంసీ ఎంపీ సుగత రాయ్ అన్నారు. కేంద్రహోెం మంత్రి రాష్ట్రాలను బలహీనపరచాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు. అయితే బీజేపీ మాత్రం ప్రతిపక్షాల వ్యాఖ్యలను తిప్పికొట్టింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు గుండా స్మగ్లింగ్ జరుగుతుందని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీఎంసీ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తుందని బెంగాల్ బీజేపీ జనరల్ సెక్రటరీ శయంతన్ బసు అన్నారు. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని పంజాబ్ సీఎం చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సిద్దూ కూడా వ్యతిరేఖిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news