ఆరెక్స్ 100 మిస్సైన నవీన్

-

అజయ్ భూపతి డైరక్షన్ లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన సినిమా ఆరెక్స్ 100. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంది. కార్తికేయ, పాయల్ రొమాన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కథను చాలా మంది హీరోల దగ్గరకెళ్లి చెప్పినట్టు అజయ్ భూపతి చెప్పాడు.

అయితే అరవింద సమేత సినిమాలో ఆ హీరో తానే అని ఓపెన్ గా చెప్పాడు నవీన్ చంద్ర. ఎన్.టి.ఆర్ సినిమాలో తాను భాగమైనందుకు తన సంతోషాన్ని వ్యక్తపరచిన నవీన్ చంద్ర ఆ సూపర్ హిట్ సినిమా మిస్సైనా ఈ సినిమా తనకు అంతకంటే హిట్ ఇచ్చిందని చెప్పాడు. సో మొత్తానికి ఆరెక్స్ 100 సినిమాను మిస్సయ్యాడు నవీన్ చంద్ర.

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర హీరోగా ఇక కెరియర్ కొనసాగించడం కష్టమని తెలిసి ఈమధ్య సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. అరవింద సమేత మాత్రం అతనికి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news