ఐరా టీజర్.. నయన్ మరో క్రేజీ అటెంప్ట్..!

-

కోలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో నయనతార ఒకరు. అక్కడ స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేలా ప్రయోగాత్మక సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది నయన్. నయనతార సినిమా అంటే కచ్చితంగా అందులో కొత్త పాయింట్ ఉంటుందని చెప్పేలా తన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నయనతార అలాంటి మరో క్రేజీ అటెంప్ట్ తోనే వస్తుంది.

ఐరా టైటిల్ తో నయనతార ఓ సినిమా చేస్తుంది. సర్జున్ కె.ఎం డైరక్షన్ లో వస్తున్న ఐరా హర్రర్ జానర్ లో వస్తుంది. రిలీజైన టీజర్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచేలా ఉంది. నాకే తెలియని ఆరుగురు నా తలరాతను తలక్రిందులు చేశారు.. అందరికి సంతోషంగా బ్రతకడం ఓ కల.. కానీ జీవితమో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు బ్రతకడమే ఓ కల అంటూ డైలాగ్స్ కూడా సినిమా కాన్సెప్ట్ ను చెప్పేలా అద్భుతంగా ఉన్నాయి.

టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. నయన్ మరో సూపర్ హిట్ సినిమాగా ఐరా తన ఖాతాలో చేరుతుందని చెప్పొచ్చు. బ్రూణ హత్యల కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. తళైవీ నయన్ నటిస్తున్న ఈ ఐరా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news