సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అంటే కచ్చితంగా నయనతార అనే చెబుతారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం అనే తేడా లేకుండా అన్ని సౌత్ భాషల్లో నయనతార తన సత్తా చాటుతుంది. ఇక తెలుగులో సీనియర్ స్టార్స్ కు ఏకైక ఆప్షన్ అవగా కోలీవుడ్ లో మాత్రం ఫీమేల్ లీడ్ సినిమాలతో సత్తా చాటుతుంది. అక్కడ స్టార్ హీరోలకు ధీటుగా నయనతార సినిమాలు ఆడుతాయంటే అమ్మడి రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.
వరుస సినిమాలు చేస్తూ పెళ్లి మాట మర్చిపోయిన నయన్ పెళ్లి ప్రస్థావన తెస్తే జారుకుంటుంది. అయితే రీసెంట్ గా పెళ్లి గురించి ఓ ఫైనల్ మాట చెప్పింది నయనతార. ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాకపోతే ఆమె 100 సినిమాలు పూర్తి చేశాక పెళ్లి చేసుకుంటుందట. ప్రస్తుతం 60 సినిమాలు చేసిన నయనతార మరో 40 సినిమాలు చేయాల్సి ఉంది.
అంటే ఎలా లేదన్నా మరో ఐదారేళ్లు విఘ్నేష్ శివన్ నయనతారతో పెళ్లి కోసం వెయిట్ చేయాల్సిందే. అయితే అప్పటి వరకు వారిద్దరు డేటింగ్ లో ఉంటారని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వీరు సహజీవనంలో ఉన్న విషయం తెలిసిందే.