ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని జీవితాన్ని పంచుకునేలా చేస్తుంది. రెండు అక్షరాల ప్రేమ.. రెండు జీవితాల అనుబంధానికి ప్రతీక. ఈ ప్రేమానుభూతి ఎలాంటి వారికైనా కలుగుతుంది. సెలబ్రిటీస్ లో కూడా ప్రేమారవిందంతో జీవితాన్ని పంచుకున్న వారు ఉన్నారు.
మహేష్-నమ్రత :
మహేష్, నమ్రత ఇద్దరు కలిసి 2005లో పెళ్లాడారు. వంశీ సినిమా టైంలో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం వారి లైఫ్ ఎంతోషంగా సాగుతుంది. కెరియర్ ఎలా ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్ లో అయినా మహేష్ తన ఫ్యామిలీకి ఇచ్చే ప్రిఫరెన్స్ టాలీవుడ్ లో మరో హీరో ఎవరు ఇవ్వరని చెప్పొచ్చు.
రాం చరణ్-ఉపాసన :
కాలేజ్ డేస్ నుండి పరిచయం ఉన్న రాం చరణ్, ఉపాసనలు కూడా కొన్నాళ్లు డేటింగ్ చేసి ఫైనల్ గా పెళ్లితో ఒకటయ్యారు. అర్ధం చేసుకునే భారాభర్తలంటే రాం చరణ్, ఉపాసనలు అనేట్టుగా వీరి అండర్ స్టాండింగ్ ఉంటుంది.
అల్లు అర్జున్-స్నేహా రెడ్డి :
టాలీవుడ్ లో మరో సక్సెస్ ఫుల్ ప్రేమ జంట అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలది. ఓ పెళ్లికెళ్లు అక్కడ స్నేహాని చూసి మనసు లాక్ చేసుకున్న బన్ని ఆమె కోసం వెతికి ఫైనల్ గా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహాని కలిశాడు. ఇక అదే ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.
నాగ చైతన్య-సమంత :
మహేష్ తర్వాత సిని పరిశ్రమకు సంబందించిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే అది నాగ చైతన్య ఒక్కడే. ఏమాయ చేసావె సినిమాతో ఆన్ స్క్రీన్ ప్రేమలో పడిన చైతు, సమంతలు ఆఫ్ స్క్రీన్ లో కూడా వారి ప్రేమని సక్సెస్ చేసుకున్నారు. ఫైనల్ గా అక్కినేని వారి ఇంట కోడలిగా సమంత అడుగు పెట్టింది.
నాని-అంజన :
నాచురల్ స్టార్ నాని, అంజన లది లవ్ మ్యారేజ్ అని తెలిసిందే. స్నేహితులుగా ఉన్న వారు జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఇవి టాలీవుడ్ లవ్ స్టోరీస్.. ఆన్ స్క్రీన్ మీద హీరోయిన్ ప్రేమ కోసం ఏదైనా చేసే ఈ హీరోలు.. ఆఫ్ స్క్రీన్ లో వారి ప్రేమను గెలిపించుకున్నారు.