నాలుగేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లంటున్న నయన్..!

-

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరక్టర్ విఘ్నేష్ శివన్ ల డేటింగ్ గురించి తెలిసిందే. వారిద్దరు ఇప్పుడు కాదు దాదాపుగా నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈమధ్య పెళ్లి కాకుండానే కలిసి ఉండటం సెలబ్రిటీస్ కు ట్రెండ్ గా మారింది. కొన్నాళ్లు కలిసి ఉండి ఓకే అనుకుంటే పెళ్లి లేదంటే ఎవరి దారి వారు చూసుకోవడమే. లేటెస్ట్ గా నయనతార, విఘ్నేష్ శివన్ లు పెళ్లికి సిద్ధమవుతున్నారట.

ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఎంగేజ్మెంట్ జరుపుకుని 2020లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. నయనతార పెళ్లి వార్త తమిళ తంబీలకు ఓ పక్క గుడ్ న్యూస్ అయినా మరో పక్క పెళ్లి తర్వాత నయనతార సినిమాలు చేస్తుందో లేదో అని బెంగ పెట్టుకున్నారు. ఏది ఏమైనా నాలుగేళ్ల తర్వాత నయన్, విఘ్నేష్ పెళ్లికి రెడీ అవడం మంచి విషయమే. ఓ పక్క స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సోలోగా సత్తా చాటుతున్న నయనతార పెళ్లి తర్వాత సోలో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news