NBK 107 నుంచి టైటిల్ లోగో రిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్ కు ఇక జాతరే

-

అఖండ సినిమా హిట్ తో మంచి ఖుషి లో ఉన్నారు బాలయ్య. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా కు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. Nbk 107 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా ఫిక్స్ అయింది. అలాగే షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే… వరుసగా అప్డేట్లను వదులుతోంది చిత్ర బృందం.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్రం బృందం. ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేస్తూ.. టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అక్టోబర్ 21వ తేదీన రాత్రి 8:15 గంటలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలిపింది. ఇందులో బాలయ్య ఫేస్ కనిపించకుండా పోస్టర్ను రిలీజ్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news