NC22 : నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న కృతిశెట్టి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు.

ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతున్నారు వీరిద్దరూ. అయితే.. నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ… ముందుకు సాగుతున్నారు. ఇందులో NV22 పేరుతో ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా.. తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు చిత్ర బృందం రివీల్‌ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది. కాగా… ఇప్పటికే ఈ జంట బంగార్రాజు సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news