ChaySam Divorce: సమంత‌ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన శాకుంతలం నిర్మాత.. అది తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

-

ChaySam Divorce: నాగ చైతన్య, సమంతల విడాకుల ప్ర‌క‌ట‌న టాలీవుడ్లో హ‌ట్ టాపిక్‌గా మారింది. ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ విన్న అదే టాపిక్.. అస‌లు వారు ఎందుకు విడిపోయారో తెలియ‌క‌పోవ‌డంతో ప‌లు ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా స‌మంత‌ను టార్గెట్ చేస్తూ.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభ‌మైంది. అస‌లు స‌మంత‌కు పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చింద‌ని పుకార్లు చ‌క్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి సమంతదే తప్పు అని అంతా అనుకుంటూ వచ్చారు.

కానీ.. ఈ క్ర‌మంలో శాకుంతలం నిర్మాత నీలిమ గుణ.. స‌మంత గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెలుగులో పెట్టింది. అసలు సమంత ఏం చేయాల‌నుకుందో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే.
ఇటీవ‌ల నీలిమ గుణ ఓ ప్ర‌ముఖ ఛానెల్ కు ఇంట‌ర్యూ ఇస్తూ.. సామ్ చైతూ విడాకుల‌పై సంచలన నిజాలు వెలుగులోకి తెచ్చింది.

‘శాకుంతలం సినిమా కోసం తొలుత‌ సమంతను సంప్రదించాం. ఆ స‌మ‌యంలో ఆమె చిత్రాలను చేయకూడదని ఫిక్స్ అయింది. ఎందుకని ఆడ‌గా ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నానని తెలిపింది. కానీ పీరియాడిక్ సినిమా, కథ నచ్చడంతో ఓకే చెప్పింది. ఆ త‌రువాత చాలా షూటింగ్ విష‌యంలో చాలా ష‌ర‌తులు పెట్టింది. సాధ్య‌మ‌నంత త్వరగా షూటింగ్ పూర్తి కావాలి. ఎందుకంటే నేను ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నాను. ఇకపై ఇదే చివరి సినిమా కావొచ్చు” అని తెలిపింది.

“శాకుంత‌లం పీరియాడిక్ సినిమా కావడంతో.. షూటింగ్ కాస్త ఆలస్యమవుతుంది, కానీ సాధ్య‌మ‌నంత త్వ‌ర‌గా పూర్తి చేస్తామని మాటిచ్చాం. అందుకు ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని స‌మంత‌ అన్నారు. అలానే చేస్తామని నేను కూడా మాటిచ్చాం’ అని నీలిమ గుణ చెప్పుకొచ్చింది.కానీ ఆగస్ట్ లో ఏం జ‌రిగిందో.. తెలియ‌దు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విడాకుల ప్ర‌క‌ట‌న చేయ‌డంతో షాక్ అయ్యామ‌ని చెప్పుకోచ్చారు.

ఇప్పుడు నీలిమ గుణ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. పిల్ల‌లు కన‌డానికి సిద్దంగా ఉన్న స‌మంత‌కు చైతూ ఎందుకు విడాకులు ఇస్తా అన్నారు? అస‌లు అక్కినేని ఫ్యామిలీయే.. ఏదైనా చేసి ఉంటుందా?, వారే ఆమె కలలను చెరిపేశారా? అనే ఊహాగానాలు స్టార్ అయ్యాయి. సామ్ చైతూలు విడాకుల ప్ర‌క‌ట‌న‌పై క్లార‌టీ ఇచ్చేవ‌ర‌కూ .. మిస్ట‌రీగా ఉంటుంది వీరి అంశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version