యాక్టింగ్‌లో బన్నీని మించిపోయిన కూతురు..నెటిజన్ల ప్రశంసలు

కొణిదల ఫ్యామిలీలో లేడీ ఆర్టిస్ట్ నీహారిక వుంది. కానీ.. అల్లు కుటుంబం నుంచి నటీమణులు ఎవ్వరూ రాలేదు. త్వరలో ఓ బాల నటి వెండితెరపైకి రానుంది. కొణిదల కుటుంబం నుంచి నీహారిక హీరోయిన్‌గా పరిచయమైతే.. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ బాలనటి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బేబి షామిలి అంటే ఎవరో తెలీకపోయినా.. అంజిలి పాప అంటే ఈజీగా అర్థమవుతుంది. అంతలా ఆ పాత్ర ఆమెకు పేరు తీసుకొచ్చింది. బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు వరించింది. ఇలాంటి పాత్రను మ్యాచ్‌ చేయడం సాహసమే. ఈ ఫీట్‌ను అల్లు అర్జున్‌ కూతురు అర్హా సాధించింది.

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ వున్న కుటుంబం కావడం.. బన్నీ షూటింగ్స్‌కు పిల్లలు వెళ్లడంతో.. ఆ వాతావరణ ప్రభావం కొడుకు అయాన్‌.. అర్హపై పడింది. ఇక కూతురైతే.. ఇన్వాల్వ్‌ అయిపోయింది. అంజలి టైటిల్‌ సాంగ్‌కు ఈ చిన్నారి పెర్‌ఫార్మెన్స్‌కు ముద్దులు.. ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు ఫ్యామిలీ నట వారసత్వాన్ని నిలబెట్టేది కూతురే అంటే.. కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. క్యూట్‌ బేబి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను తెగ మెచ్చేసుకుంటున్నారు. చూస్తుంటే అర్హ బాలనటిగా వెండితెరపైకి రావడానికి ఎంతోటైం లేదనిపిస్తోంది.